Smart Phones: మోటరోలా నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది... రేటు రూ.10 వేల లోపే!

Motorola has launched a new smartphone Motorola G35 in India
  • 5జీ సామర్థ్యంతో మోటో జీ35 ఆవిష్కరించిన కంపెనీ
  • ధర రూ.9,999గా ప్రకటించిన కంపెనీ
  • డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న విక్రయాలు
ఫోన్ల తయారీ దిగ్గజం మోటరోలా కంపెనీ భారత్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5జీ సామర్థ్యంతో మోటో జీ35 ఫోన్‌ను మంగళవారం నాడు ఆవిష్కరించింది. ‘జీ సిరీస్‌’ ఫోన్ల‌కు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చింది. లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, గువా రెడ్ రంగులలో ఈ ఫోన్ లభిస్తుంది. 4జీబీ మెమొరీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియెంట్ ధర రూ.9,999గా మోటరోలా ప్రకటించింది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌పై ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. 

ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే  6.72-అంగుళాల డిస్‌ప్లేతో ఈ ఫోన్ తయారైంది. ఎఫ్‌హెచ్‌డీ+ 120హెర్ట్జ్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. యూనిసాక్ టీ760 ప్రాసెసర్ ఎస్‌వోసీ(సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్) ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే వెనుక వైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా , 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 16ఎంపీ ఫేసింగ్ కెమెరా ఉంది. 18వాట్స్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5000ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ ఉంది.

ఇది పన్నెండు 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. భారత్ లో 5జీ సెగ్మెంట్లో ఇదే వేగవంతమైన ఫోన్ అని మోటరోలా చెబుతోంది.
Smart Phones
New Mobiles
Tech-News
Business News

More Telugu News