Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు న‌మోదు... కార‌ణ‌మిదే!

Machilipatnam Police Filed Case on Perni Nani Wife Jayasudha
  • గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పేర్ని నాన్ని త‌న భార్య పేరుపై గిడ్డంగి నిర్మాణం
  • ఆ త‌ర్వాత దాన్ని పౌర‌స‌ర‌ఫ‌రాల‌ శాఖ‌కు అద్దెకు ఇచ్చిన వైనం
  • ఇటీవ‌ల ఆ గిడ్డంగిని త‌నిఖీ చేసిన అధికారులు 
  • పీడీఎఫ్ బియ్యం నిల్వ‌ల్లో 185 ట‌న్నులు మాయ‌మైన‌ట్లు గుర్తింపు
రేష‌న్ బియ్యం అక్ర‌మాల నేప‌థ్యంలో వైసీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని భార్య జ‌య‌సుధ‌పై కేసు న‌మోదైంది. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేర‌కు మ‌చిలీప‌ట్నం పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. 

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పేర్ని నాన్ని త‌న భార్య జ‌య‌సుధ పేరుపై గిడ్డంగిని నిర్మించారు. ఆ త‌ర్వాత దాన్ని పౌర‌స‌ర‌ఫ‌రాల‌ శాఖ‌కు అద్దెకు ఇచ్చారు. అయితే, ఇటీవ‌ల ఆ గిడ్డంగిని త‌నిఖీ చేసిన అధికారులు పీడీఎఫ్ బియ్యం నిల్వ‌ల్లో తేడా ఉండ‌డం గుర్తించారు. ఏకంగా 185 ట‌న్నుల బియ్యం మాయ‌మైన‌ట్లు తేలింది. 

అయితే, వేబ్రిడ్జి స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని పేర్ని నాని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్ర‌మంలో అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేర‌కు పోలీసులు పేర్ని నాని అర్ధాంగి జ‌య‌సుధ‌పై కేసు న‌మోదు చేశారు. 
Perni Nani
Jayasudha
Police Case
Andhra Pradesh
YSRCP

More Telugu News