Mohan Babu Family Issue: సీసీటీవీ ఫుటేజి మాయం... మోహన్ బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్
- మోహన్ బాబు కుటుంబ వివాదంలో కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజి
- సీసీటీవీ ఫుటేజి మాయం కావడంపై పోలీసుల విచారణ
- ఘర్షణలో కీలకంగా ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజి కీలకంగా మారినట్టు తెలుస్తోంది. అయితే, మోహన్ బాబు నివాసంలో సీసీటీవీ ఫుటేజి మాయం కావడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘర్షణలో కీలకంగా ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ను అరెస్ట్ చేశారు. విజయ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి వెంకట్ కిరణ్ సీసీ టీవీ ఫుటేజి మాయం చేసినట్టు గుర్తించారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.