Tirumala: తిరుమ‌ల‌, తిరుప‌తిలో దంచికొడుతున్న భారీ వ‌ర్షం.. భ‌క్తుల ఇక్క‌ట్లు!

Heavy Rain in Tirumala

  • బుధ‌వారం రాత్రి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షం
  • భారీ వ‌ర్షంతో తిరుప‌తి వీధులు జ‌ల‌మ‌యం
  • పాప‌వినాశ‌నం, శ్రీవారి పాదాల‌కు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత‌
  • వ‌ర్ష‌పు నీటితో నిండిపోయిన‌ పాప‌వినాశ‌నం, గోగ‌ర్భం

తిరుమ‌ల‌, తిరుప‌తిలో భారీ వ‌ర్షం దంచికొడుతోంది. బుధ‌వారం రాత్రి నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. భారీవ‌ర్షం కార‌ణంగా భ‌క్తులు ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ఘాట్‌ రోడ్ల‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. అలాగే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డే అవ‌కాశం ఉండ‌డంతో సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పాప‌వినాశ‌నం, శ్రీవారి పాదాల‌కు వెళ్లే మార్గాల‌ను తాత్కాలికంగా మూసివేశారు. పాప‌వినాశ‌నం, గోగ‌ర్భం వ‌ర్షం కార‌ణంగా పూర్తిగా నిండిపోయి నీరు ప్ర‌వ‌హిస్తోంది.

ఇక భారీ వ‌ర్షం కార‌ణంగా చ‌లి తీవ్ర‌త కూడా బాగా పెరిగింది. భారీ వ‌ర్షంతో తిరుప‌తి వీధులు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వెస్ట్ చ‌ర్చి కూడ‌లిలో రైల్వే అండ‌ర్ బ్రిడ్జి వ‌ర్ష‌పు నీటితో నిండింది. అధికారులు వాహ‌నాల రాక‌పోక‌ల‌ను దారి మ‌ళ్లించారు. బాలాజీ కాల‌నీ నుంచి మ‌హిళా యూనివ‌ర్సిటీ మీదుగా వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తున్నారు. 

క‌పిల‌తీర్థం పుష్క‌రిణికి భ‌క్తులు వెళ్ల‌కుండా టీటీడీ అధికారులు నిలిపివేశారు. తిరుప‌తిలో మాల్వాడిగుండం జ‌ల‌పాతం పొంగిపొర్లుతోంది. అటు లక్ష్మీపురం కూడ‌లి, గొల్ల‌వానిగుంటలోని లోత‌ట్టు ప్రాంతాల్లో భారీగా వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది.   

  • Loading...

More Telugu News