Sukumar: 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్
- రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్'
- జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- ఈ నెల 21 అమెరికాలో మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా సుకుమార్ వస్తున్నారంటూ ప్రకటించిన మేకర్స్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, టీజర్.. గేమ్ ఛేంజర్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ అమెరికాలో నిర్వహిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నెల 21న డల్లాస్‌లోని కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టీఎక్స్ 75040 వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే, తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్న ముఖ్య అతిథిని మేకర్స్ వెల్లడించారు.
ఆయన మరెవరో కాదు. ఇటీవల 'పుష్ప-2'తో దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగేలా చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ మేరకు చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ మెగా ఈవెంట్‌కి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో 'ఆర్‌సీ17' రూపొందనుంది. ఈ నేపథ్యంలో ఛరిష్మా డ్రీమ్స్ అధినేత రాజేశ్ కల్లేపల్లి ఆధ్వర్యంలో.. డల్లాస్‌లో జరగబోతున్న ' గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం.
ఇక 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని.. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్. జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.