Isro: భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్​... మన ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక

isro warns of gigantic asteroid likely to collide with earth
  • అంతరిక్షంలో తిరుగుతున్న ఆస్టరాయిడ్ అపోఫిస్
  • భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందన్న ఇస్రో శాస్త్రవేత్తలు
  • ఇస్రోకు చెందిన 'నేత్ర' విభాగం ఆధ్వర్యంలో పరిశోధన
అంతరిక్షంలో తిరుగుతున్న ఒక భారీ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ ఆస్టరాయిడ్ ఢీకొంటే దారుణమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ ఆస్టరాయిడ్ పై ఇస్రో పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వివరాలను ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తాజాగా వెల్లడించారు.

మరో ఐదేళ్లలో ఢీకొనే చాన్స్...
అంతరిక్షంలో తిరుగుతున్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భవిష్యత్తులో భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 450 మీటర్ల పొడవు, 170 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్... 2029 ఏప్రిల్ 13న భూమికి అత్యంత దగ్గరగా అంటే.. కేవలం 32 వేల కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకువెళుతుందని తేల్చారు. అంటే భూమి చుట్టూ స్థిర కక్ష్యలో తిరిగే కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే కూడా ఇది దగ్గరగా వస్తుండడం గమనార్హం.

‘నేత్ర’ ఆధ్వర్యంలో పరిశోధన
అపోఫిస్ మన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అపోఫిస్ భూమిని ఢీకొట్టే పరిస్థితి, దాని గమనం, ఇతర అంశాలపై ఇస్రోలోని ‘నేత్ర (నెట్ వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్)’ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో నాసాకు చెందిన ఒసిరిస్ ఆర్ఈఎక్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రామ్సెస్ విభాగాలతో ఆస్టరాయిడ్లపై పరిశోధనలో కలసి ముందుకువెళుతున్నట్టు వివరించారు.
Isro
science
offbeat
asteroid
Viral News

More Telugu News