Ram Gopal Varma: అల్లు అర్జున్ కేసు గురించి అధికారులకు 4 ప్రశ్నలు వేసిన రాంగోపాల్ వర్మ

Ram Gopal Varma four questions after Allu Arjun arrest
  • పుష్కరాల్లో ఎవరైనా పోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్న
  • ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో పోతే నాయకులను అరెస్ట్ చేస్తారా? అని నిలదీత
  • భద్రతా ఏర్పాట్ల అంశం పోలీసులు, ఆర్గనైజర్లదే అన్న వర్మ
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకు నాలుగు ప్రశ్నలు అంటూ ట్వీట్ చేశారు.

1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల్లో  తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?
2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?
3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని  అరెస్ట్ చేస్తారా?
4. భద్రత ఏర్పాట్ల అంశం పోలీసులు, ఆర్గనైజర్లదే తప్ప... సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటూ వర్మ ప్రశ్నలు సంధించారు.
Ram Gopal Varma
Allu Arjun
Tollywood
Telangana

More Telugu News