Viral Videos: చంద్రబాబు-పవన్ సరదా ముచ్చట్లు.. ఇంత మంచి వీడియో ఎలా మిస్సయ్యామా? అంటూ నెటిజన్ల కామెంట్లు
విజయవాడలో నిన్న ఏర్పాటు చేసిన ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి వేదికపై సరదాగా ముచ్చట్లాడుతూ, నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు చెవిలో పవన్ ఏదో చెప్పడం.. ఆయన జాగ్రత్తగా విని తిరిగి బదులివ్వడం, ఆ తర్వాత పవన్ చేయి పట్టుకుని నవ్వుతూ లాగే ప్రయత్నం చేయడం వంటి సరదా సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత చంద్రబాబు చేయి పట్టుకున్న పవన్.. మళ్లీ ఇంకేదో చెప్పడం.. సీఎం మరోమారు చెవి దగ్గరగా పెట్టి వినడం.. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుని ముందుకెళ్లడం కనిపించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాకు ఎక్కి తెగ వైరల్ అవుతోంది. నిన్న అల్లు అర్జున్ గొడవలో పడి ఇంత మంచి వీడియోను మిస్సయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.