Seethakka: మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నాం... తప్పు చేస్తే శిక్షపడాలి: మంత్రి సీతక్క

Minister Seethakka condemns Mohan Babu attak on journalist
  • తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్న మంత్రి సీతక్క
  • జర్నలిస్ట్ వైద్య ఖర్చులను మోహన్ బాబు భరించాలన్న మంత్రి
  • జర్నలిస్ట్‌ల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటామన్న మంత్రి
జర్నలిస్ట్ రంజిత్‌పై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తున్నామని, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు. ఇటీవల మోహన్ బాబు తన ఇంట్లో ఓ జర్నలిస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై మంత్రి స్పందించారు.

దాడిలో గాయపడిన జర్నలిస్ట్ వైద్య ఖర్చులను మోహన్ బాబు భరించాలన్నారు. జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమది ప్రజా ప్రభుత్వమని, జర్నలిస్ట్‌లపై దాడులకు చోటు లేదన్నారు. జర్నలిస్ట్‌ల రక్షణకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

మోహన్ బాబు కుటుంబంలో వివాదం నేపథ్యంలో ఈ వార్తను కవర్ చేసేందుకు జర్నలిస్టులు జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్ గాయపడ్డారు. దీనికి సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది.
Seethakka
Mohan Babu
Tollywood
Telangana

More Telugu News