Mayayuti Alliance: మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం... బీజేపీ వద్దే కీలక శాఖలు

Newly appointed minister takes oath in Maharashtra

  • ఇటీవలే ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
  • అధికారం నిలబెట్టుకున్న మహాయుతి కూటమి
  • 132 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ
  • ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్
  • బీజేపీకి 19 మంత్రి పదవులు
  • బీజేపీకి హోంశాఖ, రెవెన్యూ శాఖ

మహారాష్ట్రలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బీజేపీ-శివసేన-ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి ఘనవిజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. ఈసారి బీజేపీ (132) అత్యధిక స్థానాలు గెలుచుకున్న అతి పెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (షిండే వర్గం) 57 స్థానాలు, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) 41 స్థానాలల్లో గెలిచాయి. 

ఎక్కువ స్థానాల ఆధారంగా ఈసారి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పోస్టులు చేపట్టారు. వీరు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. 

కాగా, నేడు మిగతా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కీలక శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకుంది. బీజేపీకి హోంశాఖ, రెవెన్యూ శాఖలు లభించాయి. ఎన్సీపీకి ఆర్థికశాఖ, శివసేనకు రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు దక్కాయి. 

మొత్తమ్మీద, గెలిచిన ఎమ్మెల్యేల దామాషా ప్రకారం బీజేపీకి 19 మంత్రి పదవులు దక్కగా... శివసేనకు 12, ఎన్సీపీకి 9 మంత్రి పదవులు కేటాయించారు.

  • Loading...

More Telugu News