Harish Rao: రేవంత్ హిట్ వికెట్... హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

harish rao slams cm revanth reddy hit wicket

  • రాహుల్ గాంధీ వద్ద రేవంత్ అపాయింట్మెంట్ పొందలేకపోతున్నాడన్న హరీశ్ రావు
  • రైతుబంధు, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేశారన్న హరీశ్ రావు
  • ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న హరీశ్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న హరీశ్ రావు.. అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వద్ద అపాయింట్‌మెంట్ కూడా పొందలేకపోతున్నాడని అన్నారు.

'ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయింది' అంటూ హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేశారని అన్నారు. హైడ్రా పేరుతో విధ్వంసం చేయడం తప్ప ఏడాది పాలనలో ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 

గురుకుల పాఠశాల విద్యార్ధుల సమస్యలు, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. 

  • Loading...

More Telugu News