cabinet meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

telangana state cabinet meeting

  • సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేటి మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటీ
  • కొత్త రెవెన్యూ చట్టం (ఆర్ఓఆర్) బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్న కేబినెట్
  • మాజీ మంత్రి కేటిఆర్‌పై కేసు నమోదు చేసే అంశంపైనా కేబినెట్‌లో చర్చించే ఛాన్స్

తెలంగాణ కేబినెట్ భేటీ ఈ రోజు జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో .. కొత్త రెవెన్యూ చట్టం (ఆర్ఓఆర్) బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. అలాగే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధివిధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది.

ఫార్ములా– ఈ రేసింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటిఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను కూడా కేబినెట్‌లో చర్చించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది. 

  • Loading...

More Telugu News