Vijayasai Reddy: రాజ్యసభలో ముగ్గురు ఏపీ సభ్యుల ప్రమాణం... విజయసాయి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy comments in Rajya Sabha

  • టీడీపీ రాజ్యసభ సభ్యులుగా బీద మస్తాన్ రావు, సానా సతీశ్ ప్రమాణం
  • బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఆర్.కృష్ణయ్య ప్రమాణం
  • తమ నేతలను టీడీపీ లాక్కుందన్న విజయసాయిరెడ్డి

ఇటీవల ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరిచేత రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. 

ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను కుట్రపూరితంగా ప్రలోభాలకు గురి చేసి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ ఛైర్మన్... విజయసాయి వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News