Inter: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana inter exams dates released
  • మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు
  • ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
  • జనవరి 29న ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది. 

జనవరి 29న ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుందన్నారు. జనవరి 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఉంటుందని తెలిపింది. 

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 5, 7, 11, 13, 17, 19, 21, 24 తేదీల్లో... ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి 6, 10, 12, 15, 18, 20, 22, 25 తేదీల్లో జరగనున్నాయి.
 
Inter
Exams
Telangana

More Telugu News