Mahima Gaur: ‘సింటా’ పేరుతో సినీ నటి మహిమా గౌర్‌కు సైబర్ నేరగాళ్ల టోకరా

Cyber Criminals Cheated Actress Mahima Gaur

  • హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఉంటున్న నటి
  • ‘సింటా’లో జీవితకాల సభ్యత్వాన్ని రూ. 50,500కే అందిస్తున్నట్టు నిందితుల ఫోన్ 
  • నమ్మి మూడు దఫాలుగా డబ్బు బదిలీ
  • ఆ తర్వాత కూడా డబ్బులు అడగడంతో అనుమానం
  • సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన నటి  

సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) పేరుతో సినీ నటి మహిమా గౌర్ (24)కు సైబర్ కేటుగాళ్లు టోకరా వేశారు. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఉంటున్న నటికి ఈ నెల 6న రంజన్ షాహీ అనే వ్యక్తి ఫోన్ చేసి తనను తాను నిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అనిత అనే మరో మహిళ ఫోన్ చేసి తాను సింటా నుంచి హెచ్ఆర్ డైరెక్టర్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకుంది. సింటాలో జీవితకాల సభ్యత్వాన్ని రూ. 50,500కే అందిస్తున్నట్టు చెప్పింది.

ఆమె మాటలు నమ్మిన మహిమా గౌర్ ఆమె చెప్పిన ఖాతాకు మూడు విడతలుగా రూ. 50,500 ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే, ఆ తర్వాత కూడా ఇంకా డబ్బులు చెల్లించాలని కోరడంతో అనుమానం వచ్చిన మహిమ సైబర్ హైల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రూ. 20,200 సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News