President Of India: ఏపీలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
- మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి
- 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం
- ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ముగిసింది. ఈ ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన రాష్ట్రపతి... మంగళగిరిలో ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఎయిమ్స్ స్నాతకోత్సవం ముగిసిన అనంతరం రాష్ట్రపతి ముర్ము గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. రాష్ట్రపతికి విమానాశ్రయంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.
ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.