Nara Bhuvaneswari: ఎల్లుండి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
- 4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన
- 4 మండలాల్లో వివిధ వర్గాలను కలవనున్న సీఎం చంద్రబాబు అర్ధాంగి
- డీఎస్సీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఎల్లుండి (డిసెంబరు 19) నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. భువనేశ్వరి 4 రోజుల పాటు 4 మండలాల్లో పర్యటించనున్నారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ముఖ్యంగా, డీఎస్సీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చిరు వ్యాపారులకు ఉపయోగపడే తోపుడు బళ్లు, దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేయనున్నారు. భువనేశ్వరి పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.