Poco: పోకో నుంచి సరికొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్ల విడుదల.. ఆకర్షణీయంగా ధరలు
- పోకో సీ7, పోకో ఎం7 ప్రో ఫోన్ల ఆవిష్కరణ
- అధునాతన ఫీచర్లతో బడ్జెట్ ధరలో వచ్చిన స్మార్ట్‌ఫోన్లు
- డిసెంబర్ 20 నుంచి ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం ‘షియోమీ’ కంపెనీకి సబ్-బ్రాండ్ అయిన పోకో భారత విపణిలో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. పోకో సీ సిరీస్‌లో భాగంగా ‘పోకో సీ7’, పోకో ఎం సిరీస్‌లో భాగంగా ‘పోకో ఎం7 ప్రో’ ఫోన్లను ఆవిష్కరించింది. పోకో ఎం7 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 ర్యామ్ జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999గా కంపెనీ వెల్లడించింది.
డిసెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక పోకో సీ75 5జీ సింగిల్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,999గా ఉందని, డిసెంబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.
పోకో ఎం7 ప్రో ఫీచర్లు ఇవే
పోకో ఎం7 ప్రో స్మార్ట్‌ఫోన్ పలు ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. 6.67 అంగుళాల ఎఫ్‌హెచ్‌డ్, అమోల్డ్ డిస్‌ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫీచర్లతో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 5,110 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 20ఎండీ రిజల్యూషన్ కెమెరా ఉంది. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
పోకో సీ75 ప్రత్యేకతలు ఇవే
హై రిజల్యూషన్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌లతో 6.88 అంగుళాల డిస్‌ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌లతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 18వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ముందువైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 1.8ఎంపీ క్యూవీజీఏ సెకండరీ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా ఉన్నాయి. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్టు పేర్కొంది.