Global Star: ‘గేమ్ చేంజర్’కు తలనొప్పిగా రామ్‌చరణ్ ‘గ్లోబల్ స్టార్’డమ్
- రాచ్‌చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’కు రాని హైప్
- ట్రిపులార్ తర్వాత వస్తున్న తొలి మూవీ ఇదే
- ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్‌కు న్యాయం చేయాలంటే భారీ వసూళ్లు రాబట్టాల్సిందే
- సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రానికి బిగ్ స్టార్స్ నుంచి లేని పోటీ
- అయినా, చప్పగానే ప్రమోషన్స్
- ‘గేమ్ చేంజర్’పై ఇప్పటికే మొదలైన ట్రోలింగ్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచీ రామ్‌చరణ్ పేరు తర్వాత ‘గ్లోబల్ స్టార్’ అనే పదం వచ్చి చేరింది. ఆయన అభిమానులు వినడానికి ఇది చాలా బాగున్నప్పటికీ ఇప్పుడు అదే పదం ఆయన తాజా సినిమాకు అడ్డంకిగా మారింది. చెర్రీ కూడా ఆన్‌స్క్రీన్‌లో తన పేరు పక్కన ఇలా వేసుకునేందుకు అంగీకరించాడు కూడా.
చెర్రీ తాజా మూవీ ‘గేమ్ చేంజర్’. ట్రిపులార్ తర్వాత వస్తున్న తొలి మూవీ ఇది. అయితే, ఈ సినిమాకు అనుకున్నంతగా బజ్ లేకపోవడంతో ‘గ్లోబల్ స్టార్’ ఇమేజ్ ఇప్పుడు ఆయనకు అనవసర తలనొప్పిగా మారింది. ఇప్పటికే ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. రామ్‌చరణ్ తన ట్యాగ్‌కు తగ్గట్టుగా ఇప్పుడు స్థానిక మార్కెట్లతోపాటు హిందీలోనూ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
గేమ్ చేంజర్ విడుదల విషయంలో కలిసొచ్చే విషయం కూడా ఒకటి ఉంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పోటీ ఇచ్చే బిగ్ స్టార్స్ సినిమాలు ఏవీ లేకపోవడం కొంతలో కొంత మేలు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా నుంచి ఇండియా వరకు అడ్వాన్స్ బుకింగ్స్‌పై అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప-2 రికార్డులు కొల్లగొడుతున్న నేపథ్యంలో అల్లు ఆర్మీ, మెగా ఫ్యాన్స్ మధ్య కామెంట్ల యుద్ధం తప్పేలా కనిపించడం లేదు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. గేమ్ చేంజర్ మూవీకి అనుకున్నంత హైప్ లేకపోవడం కూడా కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి. ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ తన మార్కు చూపిస్తే మూవీ సూపర్ హిట్ అవుతుంది. అదే జరిగితే రామ్‌చరణ్ ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్‌కు న్యాయం చేసినట్టు అవుతుంది.