Sunil Gavaskar: అదే జరిగితే రోహిత్ శర్మ కెప్టెన్ గా తప్పుకుంటాడు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar on Rohit Sharma captaincy
  • వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ
  • కెప్టెన్ గా రోహిత్ ను తప్పించాలని పలువురి అభిప్రాయం
  • రోహిత్ స్వార్థం లేనటువంటి కెప్టెన్ అన్న గవాస్కర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు టైమ్ బాగున్నట్టు లేదు. కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ కు గురయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో కూడా రోహిత్ విఫలమవుతున్నాడు. దీంతో, కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లో పరుగులు రాబట్టేందుకు రోహిత్ శర్మ కచ్చితంగా ప్రయత్నం చేస్తాడని ఆయన చెప్పారు. ఒకవేళ మళ్లీ విఫలమయితే తనకు తానుగా కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పుకుంటాడని అన్నారు. స్వార్థం లేనటువంటి కెప్టెన్ రోహిత్ అని... జట్టుకు భారంగా ఉండాలని ఆయన కోరుకోడని చెప్పారు. 


Sunil Gavaskar
Rohit Sharma
Team India

More Telugu News