Prasad Behara: యువతిని వేధించిన కేసులో యూట్యూబ్ నటుడు ప్రసాద్ అరెస్ట్

Behara Prasad arrested in Hyderabad

  • ప్రసాద్ వేధించినట్లు ఫిర్యాదు చేసిన సహచర నటి
  • కేసు నమోదు చేసి ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు బెహరా ప్రసాద్ తరలింపు

ప్రముఖ యూట్యూబ్ నటుడు బెహరా ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర నటిని వేధించిన కేసులో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు అతనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రసాద్‌ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో బెహరా ప్రసాద్ తనకు పరిచయమయ్యాడని, అప్పుడు తనతో ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నిరోజుల తర్వాత మరో వెబ్ సిరీస్‌లో కలిసి పని చేశామని, ఆ సమయంలో అందరిముందు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. దీనిపై ప్రశ్నిస్తే దూషించాడని, ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అందరి ముందే తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

  • Loading...

More Telugu News