Balagam Mogilayya: 'బలగం' మొగిలయ్య ఇకలేరు
![Balagam Mogilayya Passed Away](https://imgd.ap7am.com/thumbnail/cr-20241219tn67638e8c16615.jpg)
- బలగం సినిమాతో గుర్తింపు పొందిన జానపద కళాకారుడు మొగిలయ్య
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్య
- వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
'బలగం' సినిమాతో గుర్తింపు పొందిన జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలియ్య.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కొన్ని రోజులుగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో మొగిలయ్య చికిత్స కోసం నటుడు చిరంజీవి, 'బలగం' మూవీ దర్శకుడు వేణు చేయూత అందించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. కాగా, 'బలగం' సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరితమైన పాటను ఆలపించి మొగిలయ్య ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో మొగిలయ్యకు మంచి గుర్తింపు వచ్చింది.