Lalu Prasad Yadav: అమిత్ షాకు పిచ్చెక్కింది.. అంబేద్కర్ వ్యాఖ్యల వివాదంపై లాలు ప్రసాద్ ఫైర్

Amit Shah has gone mad he should give up politics Lalu Yadav demands

  • అంబేద్కర్‌ పట్ల అమిత్ షా వ్యాఖ్యలపై దుమారం
  • షా వెంటనే రాజీనామా చేసి రాజకీయాలు వదిలేయాలని లాలు ప్రసాద్ డిమాండ్
  • షాపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగోర్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పిచ్చెక్కిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై నిన్న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లాలు ఇలా విరుచుకుపడ్డారు. ‘అమిత్ షాకు పిచ్చెక్కింది. రాజకీయాలు వదిలేయాలి. వెంటనే రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. 

రాజ్యాంగంపై చర్చలో భాగంగా నిన్న రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ మాటిమాటికి ‘అంబేద్కర్’ అనడం కాంగ్రెస్‌కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. అంబేద్కర్.. అంబేద్కర్ అనడం మానేసి అన్నిసార్లు దేవుడిని స్మరిస్తే కనీసం స్వర్గానికైనా వెళ్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకశక్తిగా మారుతోందని ఆరోపించారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగోర్ నేడు లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. షా పార్లమెంటులోనే అంబేద్కర్‌ను అవమానించారని, కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పడంతోపాటు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు మాణికం ఠాగోర్ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News