HYDRAA: అల్కాపురిలో అక్రమ షట్టర్లపై పంజా విసిరిన హైడ్రా

HYDRAA removes ilegal shutters in Alkapuri
  • మార్నింగ్ రాగా అపార్ట్ మెంట్ లో అక్రమ షట్టర్ల నిర్మాణం
  • గత నెలలోనే నోటీసులు ఇచ్చిన మణికొండ మున్సిపాలిటీ
  • స్పందించిన షట్టర్ల సొంతదారులు
  • హైడ్రాకు నివేదించిన మున్సిపల్ అధికారులు
హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, అల్కాపురిలోని కొన్ని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. 'మార్నింగ్ రాగా' అపార్ట్ మెంట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన షట్టర్లను (దుకాణాలను) హైడ్రా నేడు తొలగించింది. 

ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది. 

ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు.
HYDRAA
Shutters
Alkapuri
Hyderabad
GHMC

More Telugu News