Duvvada Srinivas: దివ్వెల మాధురితో కలిసి పోలీసు విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్

Duvvada Srinivas attends Police questioning

  • పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసు
  • 41 ఏ కింద దువ్వాడకు పోలీసుల నోటీసులు
  • టెక్కలి పీఎస్ కు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవంబర్ 18న దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 

ఈ క్రమంలో ఆయన దివ్వెల మాధురితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్రస్తుతం ఆయనను టెక్కలి పీఎస్ లో విచారిస్తున్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మీ వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేతల ప్రోద్బలం ఉందా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News