KTR: హైకోర్టులో కేటీఆర్ తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది

Hearing going on in High Court on KTR petition

  • రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారన్న న్యాయవాది సుందరం
  • కేటీఆర్ లబ్ధి పొందినట్టు ఎఫ్ఐఆర్ లో లేదని వ్యాఖ్య
  • 14 నెలల తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేశారన్న సుందరం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తున్నారు. 

రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కోర్టుకు సుందరం తెలిపారు. నిధుల చెల్లింపులతో కేటీఆర్ లబ్ధి పొందినట్టు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేదని ప్రశ్నించారు. కేటీఆర్ పై పెట్టిన కేసులో సీపీ యాక్ట్ వర్తించదని చెప్పారు. అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత ఇప్పుడు కేసు పెట్టారని తెలిపారు. 

రేస్ కు సంబంధించి సీజన్-9కి అగ్రిమెంట్ కుదిరిందని... సీజన్-10కి అగ్రిమెంట్ అవసరం లేదని చెప్పారు. రేస్ నిర్వాహకులకు నిధులు పంపిస్తే... కేటీఆర్ పై కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎఫ్ఈఓ (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) సంస్థకు రెండు విడతలుగా నిధులు చెల్లించారని... మూడో విడత చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఈవో లేఖ రాసిందని... అయితే, నిధులు చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్టైతే ఈసీకి ఫిర్యాదు చేయాలని... ఏసీబీ ఎందుకు కేసు నమోదు చేసిందని కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News