Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం... ఉత్తరాంధ్రకు అలర్ట్

APSDMA issues rain alert for North Andhra
  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న ఏపీఎస్డీఎంఏ
  • ఉత్తరాంధ్ర, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో  కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. 

ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తదుపరి 24 గంటల్లో ఇది వాయుగుండంగా కొనసాగుతూ ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. 

దీని ప్రభావంతో రేపు (డిసెంబరు 21) పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

అదే సమయంలో... విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తాజా బులెటిన్ లో పేర్కొంది.
Rain Alert
APSDMA
Depression
Andhra Pradesh
Bay Of Bengal

More Telugu News