Harish Rao: విజన్ లేదు, విజ్ డమ్ లేదు... ఈ సుద్దపూస ఒలింపిక్స్ నిర్వహిస్తాడట: రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

ex minister harish rao sensational comments on cm revanth reddy in telangana

  • డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారన్న హరీశ్ రావు
  • రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారే పరిస్థితికి వచ్చిందన్న హరీశ్ రావు
  • రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు దిక్కులేకుండా పోయిందన్న హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కేటీఆర్‌పై కేసు పెట్టారని అన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి అటు విజన్ లేదు..ఇటు విజ్‌డమ్ లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దిగజారే పరిస్థితి వచ్చిందన్నారు.

ఇక్కడ ఇంటర్నేషనల్ రేస్ మూడేండ్లు జరగాల్సి ఉంటే, దాన్ని మధ్యంతరంగా రద్దు చేశాడన్నారు. ఈ పాటిదానికి, ఈ సుద్దపూస 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు. 'కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీశాడన్నట్లు' సామెతను గుర్తు చేస్తూ..ఒప్పందం అయి మూడేళ్ల రేసు నిర్వహించే అవకాశం ఉన్నా ఇంటర్నేషనల్ ఈవెంట్‌ను రద్దు చేసి ఒలింపిక్స్ నిర్వహిస్తానని డబ్బా కొడుతున్నాడని అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల నష్టం జరిగిందని లండన్‌లో ప్రభుత్వం మీద కేసు వేసిందని, ఆ కేసు గెలిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ మరింత దిగజారుతుందన్నారు. ఇది కేవలం కేటీఆర్‌కు సంబంధించిన అంశం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినది అని అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు ఏదో శోధించినట్లు కేటీఆర్‌పై కేసు పెట్టారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన కారణంగా నేడు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా పోయాయని, ఉద్యోగ కల్పనకు దిక్కు లేకుండా పోయిందని హరీశ్ రావు విమర్శించారు. 

  • Loading...

More Telugu News