KTR: ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు?: కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

BRS Working President KTR Criticizes CM Revanth Reddy

  • సీఎం రేవంత్ రెడ్డిపై మ‌రోసారి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు
  • ఆటోడ్రైవ‌ర్ల‌కు ఇస్తాన‌న్న రూ.12వేల సాయం ఏమైందంటూ నిల‌దీత‌
  • అన్ని వ‌ర్గాల‌ను మోస‌గించారంటూ ఆగ్ర‌హం
  • సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ వార్త‌ను షేర్ చేసిన కేటీఆర్‌

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆటోడ్రైవ‌ర్ల‌కు ఇస్తాన‌న్న రూ.12వేల సాయం ఏమైంద‌ని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిల‌దీశారు. ఆటో డ్రైవ‌ర్ల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌ను మోస‌గించార‌ని ఆయ‌న‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ వార్త‌ను 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా 'ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు?' అంటూ కేటీఆర్ షేర్ చేశారు. 

"ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధ‌గ ధ‌గ మెరిసిన చేతుల్లోకి పురుగు మందు డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12వేల సాయమేది? రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు. తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు!" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  

  • Loading...

More Telugu News