Komatireddy Venkat Reddy: రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి

Komatireddy announces Rs 25 lakhs for Revathi family

  • పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట
  • రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు 
  • భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్న మంత్రి కోమటిరెడ్డి 

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించారు. 

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున రూ.25 లక్షల ఆర్ధికసాయం అందిస్తున్నా అని నేడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పరిహారం ఇస్తామని చెప్పిన అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేకపోయాడని విమర్శించారు.

ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేంత వరకు అన్ని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి బాలుడి ఆరోగ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News