Coins: భార్యపై కసితో... రూ.80 వేల చిల్లర నాణేలతో కోర్టుకు వచ్చిన వ్యక్తి

Man brings coins worth Rs 80 thousand to family court

  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • విడాకుల పిటిషన్ వేసిన భార్య
  • భార్యకు రూ.80 వేల భరణం చెల్లించాలన్న కోర్టు
  • 20 సంచుల్లో నాణేలతో వచ్చిన వ్యక్తి
  • నోట్లు తీసుకురావాలంటూ తిప్పి పంపిన న్యాయమూర్తి

భార్య మీద ఎంతో కోపం ఉంటే తప్ప ఓ భర్త ఇలాంటి పనికి పూనుకోడు! తమిళనాడులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ విడాకుల కేసును విచారించిన కోర్టు... భార్యకు భరణం కింద రూ.80 వేలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. దాంతో ఆ భర్త అన్నీ రూ.2, రూ.1 నాణేలు తీసుకుని కోర్టుకు వచ్చాడు. సంచులకొద్దీ నాణేలు తీసుకువచ్చిన ఆ వ్యక్తిని చూసి న్యాయమూర్తి విస్తుపోయాడు. 

ఈ ఘటన వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో 37 ఏళ్ల ఓ వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2023లో అతని భార్య ప్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోయంబత్తూరు అదనపు ఫ్యామిలీ కోర్టు... భార్యకు రూ.2 లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని ఆ ట్యాక్సీ డ్రైవర్ ను ఆదేశించింది. ఆ డబ్బును కోర్టులో చెల్లించాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

అయితే, ఆ వ్యక్తి ఇలాంటి సమయంలో కూడా భార్యపై కోపాన్ని వీడలేదు. ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కోర్టుకు నాణేలతో వచ్చాడు. 20 సంచుల్లో నాణేలతో వచ్చిన ఆ వ్యక్తిని చూసిన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణేలు కాదు... వెళ్లి నోట్లు తీసుకురా అని తిప్పి పంపారు. 

దాంతో, ఆ వ్యక్తి నాణేల సంచులన్నీ కార్లో పెట్టుకుని వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News