astronauts: ఇస్రో-యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం

space big agreement between isro esa both agencies will cooperate on training of astronauts
  • ఒప్పందంపై సంతకాలు చేసిన ఇస్రో, ఈసా చీఫ్‌లు సోమనాథ్, జోసెఫ్ అప్చ్ బాచెర్
  • ఈ ఒప్పందం రెండింటి మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని వెల్లడి
  • ఆక్సియం – 4 మిషన్ కోసం ఉమ్మడి పని పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇస్రో, ఈసా చీఫ్‌లు    
వ్యోమగాముల శిక్షణ, పలు పరిశోధనలకు సంబంధిత కార్యక్రమాలపై సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూరోపియన్ స్పేస్ ఏజన్సీ (ఈసా) మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం (ఎంఓయూ) పై ఇస్రో చీఫ్ సోమనాథ్, ఈఎస్ఏ (ఈసా) డైరెక్టర్ జోసెఫ్ అప్చ్ బాచెర్ సంతకాలు చేశారు. రెండు సంస్థలు మానవ అన్వేషణ, పరిశోధనల్లో సహకరిస్తాయని ఇస్రో ప్రకటనలో పేర్కొంది. 

వ్యోమగామి శిక్షణ, ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఈసా సౌకర్యాల వినియోగం, మానవ, బయో మెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, అలాగే విద్య, ప్రజా అవగాహన కార్యకలాపాలు కలిసి పని చేస్తాయని ఇస్రో వెల్లడించింది. అక్సియం - 4 మిషన్‌లో ఇస్రో గగన్‌యాన్, ఈసా వ్యోమగాములు ఉన్నారని ప్రకటనలో తెలిపింది.
 
ఈ మిషన్‌లో భారత శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆవిష్కరణలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో మానవ రహిత స్పేస్ ఫ్లైట్‌కి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిందని సోమనాథ్ తెలిపారు. ఈ ఒప్పందం రెండింటి మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆక్సియం - 4 మిషన్ కోసం ఉమ్మడి పని పురోగతిపై ఇస్రో, ఈసా చీఫ్‌లు సంతృప్తి వ్యక్తం చేశారు.   
astronauts
ISRO
esa
training of astronauts

More Telugu News