Perni Nani: పేర్ని నాని ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

The police issues notices to Perni Nani and his son in Rice Case
  • మధ్యాహ్నం 2 గంటల్లోగా స్టేషన్‌కు రావాలని ఆదేశాలు
  • నిజానిజాలు చెప్పాలని కోరిన పోలీసులు
  • అందుబాటులో ఉన్న రికార్డులు అందజేయాలంటూ నోటీసులు
  • జేఎస్ గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం ఘటనలో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కొడుకు పేర్ని కిట్టు నిందితులుగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల లోగా స్టేషన్‌కు రావాలంటూ కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందించేందుకు ఇంటికి వెళ్లగా... ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పోలీసులు తలుపులకు అంటించారు. 

నిజానిజాలను చెప్పాలని నోటీసుల్లో పోలీసులు కోరారు. అందుబాటులో ఉన్న రికార్డులను అందివ్వాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు.  ఈ కేసులో మానస తేజను ఏ2 ముద్దాయిగా చేర్చారు. పరారీలో  ఉన్న మానస తేజ కోసం గాలిస్తున్నారు. కాగా, జేఎస్ గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం ఘటనలో ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని పోలీసులు స్పష్టం చేశారు.
Perni Nani
YSRCP
Andhra Pradesh
Viral News

More Telugu News