Mohan Babu: మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య: తెలంగాణ డీజీపీ

Telangana DGP responds on Mohan Babu issue
  • తెలంగాణలో డీజీపీ ప్రెస్ మీట్
  • మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం విచారకరమని వ్యాఖ్యలు
  • ఆయనపై కేసు నమోదు చేశామని వెల్లడి
  • చట్ట ప్రకారం ముందుకు వెళతామని స్పష్టీకరణ
తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న విషయాలపై డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. నటుడు మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య అని తెలిపారు. కుటుంబ సమస్య కాబట్టి వాళ్లు ఇంట్లోనే కూర్చుని పరిష్కరించుకోవచ్చని సూచించారు. 

కాగా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి విచారకరమని అన్నారు. ఈ ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. చట్ట ప్రకారం మోహన్ బాబుపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

సినిమా హీరోలు అయినా, వారు సమాజంలో పౌరులే కాబట్టి... తప్పు చేస్తే చట్ట ప్రకారం వ్యవహరిస్తామని డీజీపీ పేర్కొన్నారు.
Mohan Babu
DGP
Hyderabad
Telangana
Tollywood

More Telugu News