Allu Arjun: అభిమానులకు ఇదే నా విజ్ఞప్తి: అల్లు అర్జున్

Allu Arjun appeal to fans keep distance to abusive posts
  • మరింత ముదురుతున్న సంధ్య థియేటర్ వ్యవహారం
  • ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టవద్దన్న అల్లు అర్జున్
  • ఫ్యాన్స్ ముసుగులో నెగెటివ్ పోస్టులు పెడుతున్నారని వెల్లడి
  • వాటికి దూరంగా ఉండాలని అభిమానులకు సూచన
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం మరింత ముదురుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్ తాజాగా తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. అభిమానుల ముసుగులో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వస్తున్నాయని, వాటికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. 

"నా అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని కోరుకుంటున్నాను. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని విన్నపం. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్నారు... వారిపై చర్యలు తీసుకుంటాం. నెగెటివ్ పోస్టులు పెడుతున్న వారికి దూరంగా ఉండాలని నా అభిమానులకు సూచిస్తున్నాను" అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.
Allu Arjun
Fans
Social Media
Sandhya Theater Incident
Hyderabad

More Telugu News