Komatireddy Venkat Reddy: ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy demands Allu Arjun should apologise CM Revanth Reddy

  • నిన్న ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్
  • అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందన
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎదురుదాడిగా మాట్లాడడం సరికాదని స్పష్టీకరణ

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

తన ఇమేజ్ ను దెబ్బతీశారని అల్లు అర్జున్ మాట్లాడుతున్నారని... బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తన లీగల్ టీమ్ ఒప్పుకోవడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News