Prashanth Neel: ప్రభాస్ 'సలార్' గురించి నేను ఎంతో ఊహించాను.. కానీ, రిజల్ట్ మరోలా వచ్చింది: ప్రశాంత్ నీల్

Prashant Neel said he is not happy with Salar movie theatre result
  • 'సలార్' ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది పూర్తి
  • థియేటర్లలో వచ్చిన రిజల్ట్ పట్ల తృప్తిగా లేనన్న ప్రశాంత్ నీల్
  • 'సలార్-2' గురి తప్పదని ధీమా
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్' మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటించింది. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. 

'సలార్' విడుదల అయి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'సలార్' సక్సెస్ ను తాను ఎంతో ఊహించానని... కానీ, వచ్చిన రిజల్ట్ పట్ల తాను పూర్తిగా తృప్తిగా లేనని చెప్పారు. 

'కేజీఎఫ్' బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో 'సలార్' పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారని ప్రశాంత్ నీల్ తెలిపారు. అయితే, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తాను అందుకోలేకపోయాననే భావన తనలో ఉందని చెప్పారు. సినిమా విడుదలయిన తర్వాత థియేటర్లలో వచ్చిన రిజల్ట్ పట్ల తాను సంతోషంగా లేనని అన్నారు. కానీ, 'సలార్-2' మాత్రం గురి తప్పదని... సీక్వెల్ కోసం కథను పక్కాగా రెడీ చేశానని తెలిపారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలలో 'సలార్-2' బెస్ట్ గా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు.
Prashanth Neel
Prabhas
Salar
Salar 2
Tollywood
Bollywood

More Telugu News