Telangana: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు
- విలేకరులపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మోహన్ బాబు
- ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు
- విచారణ జరిపి... పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద విలేకరులపై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మోహన్ బాబును ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.
ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారించిన హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.