Rashmika Mandanna: క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు రష్మిక, విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda and Rashmika Mandanna landed in Mumbai

  • ముంబైలో ల్యాండ్ అయిన విజయ్ దేవరకొండ-రష్మిక 
  • ఎయిర్‌పోర్టులో అభిమానులతో కలిసి ఫొటోలు దిగిన రష్మిక
  • రిలేషన్‌షిప్‌పై మళ్లీ గుప్పుమన్న వార్తలు
  • ఇటీవల రెస్టారెంట్‌లో కలిసి కనిపించిన రష్మిక, విజయ్  

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై వారు స్పందిస్తూ తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు తరచూ కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా, ఈ వార్తలను బలపరిచే మరో ఘటన జరిగింది.

సోమవారం వారిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిశారు. రష్మిక తొలుత ముంబైలో ల్యాండయ్యారు. అక్కడ ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా ముంబైలో వాలిపోయారు. దీంతో ఇద్దరూ కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఈ జంట రెస్టారెంట్‌లో కలిసి కనిపించిన ఫొటో ఒకటి వైరల్ అయింది. 

రష్మికతో డేటింగ్ వార్తలపై విజయ్ దేవరకొండ ఇటీవల మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు చెబుతానని పేర్కొన్నాడు. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో తనకు తెలియదని, ఒకవేళ ఉంటే దాంతోపాటే బాధ కూడా ఉంటుందని పేర్కొన్నాడు. ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో రష్మిక మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలని, తన దృష్టిలో ప్రేమలో ఉండటమంటే భాగస్వామిని కలిగి ఉండటమేనని చెప్పారు. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News