Jr NTR: ఫ్యాన్స్‌కి డ‌బ్బులిస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి.. అభిమానికి ఎన్టీఆర్ సాయంపై మాధవీలత!

Woman Sensational Allegations Against Jr NTR Tollywood Heroine Maadhavi Latha Fires

  • క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న వీరాభిమాని కౌశిక్ చికిత్స‌కు సాయం చేస్తాన‌న్న ఎన్‌టీఆర్
  • కానీ, త‌మ‌కు ఎలాంటి సాయం తారక్ నుంచి అంద‌లేదంటూ అత‌ని త‌ల్లి ఆరోప‌ణ‌లు
  • ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
  • వీడియోపై ఘాటుగా స్పందించిన హీరోయిన్ మాధ‌వీల‌త‌

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ త‌న వీరాభిమాని కౌశిక్ క్యాన్స‌ర్‌తో పోరాడుతుండ‌గా అత‌డి కోరిక మేర‌కు గ‌తంలో తార‌క్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ స‌మ‌యంలో యంగ్ టైగ‌ర్ అత‌ని చికిత్స‌కు సాయం చేస్తాన‌ని కౌశిక్ త‌ల్లితో చెప్పారు. 

అయితే, ఇప్పుడు కౌశిక్ త‌ల్లి ఎన్‌టీఆర్‌పై ఆరోప‌ణ‌లు చేసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తార‌క్ అప్పుడు సాయం చేస్తాన‌ని మాటిచ్చి, ఇప్పుడు స్పందించ‌డం లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆ వీడియోలో ఉంది. కేవ‌లం ఆయ‌న ఫ్యాన్స్ నుంచి మాత్ర‌మే త‌మ‌కు కొంత‌మేర సాయం అందింద‌ని ఆమె పేర్కొన్నారు. 

ఇక నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియోపై హీరోయిన్ మాధ‌వీల‌త తీవ్రంగా స్పందించారు. ఈ ర‌కంగా ఫ్యాన్స్‌కి డ‌బ్బులిస్తూ పోతే హీరోలు అడుక్కుతినాల‌న్నారు. ఆశించేవాళ్లు అభిమానులు ఎలా అవుతార‌ని ఆమె ప్ర‌శ్నించారు. 

"ఐతే ఏం చేద్దాం. ఈ ర‌కంగా ఫ్యాన్స్‌కి డ‌బ్బులిస్తూ పోతే హీరోలు రోడ్డున‌ప‌డి అడుక్కుతినాలి. అభిమాని అంటే ఆశించే వాడు కాదు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం. ఆశిస్తే స్వార్థం అవుద్ది కానీ అభిమానం ఎలా అవుద్ది? రోజుకొక‌రు మాకు సాయం చేయ‌మ‌ని బ‌య‌టికి వ‌స్తారు. క‌థ‌లు ప‌ట్టుకుని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చాలా మంది తిరుగుతుంటారు. అదృష్టం ఉంటే అవ‌కాశం వ‌స్త‌ది" అని మ‌ధ‌వీల‌త త‌న సోష‌ల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.   


  • Loading...

More Telugu News