MP Raghunandan Rao: అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ ర‌ఘునంద‌న్ రావు

BJP MP Raghunandan Rao says Case on Allu Arjun is a Small
  • సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌ను ప్ర‌భుత్వం కావాల‌ని పెద్ద‌గా చేస్తోందన్న ‌రఘునందన్ 
  • భ‌ద్ర‌తా వైఫ‌ల్యాన్ని ప‌క్క‌న‌పెట్టి.. హీరోను మాత్ర‌మే కార‌ణంగా చూపుతున్నారంటూ విమ‌ర్శ‌
  • ప్ర‌భుత్వం క‌క్షగ‌ట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌న్న బీజేపీ ఎంపీ
సంధ్య థియేట‌ర్ తొక్కిసలాట ఘ‌ట‌న‌కు సంబంధించి బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కావాల‌ని పెద్ద‌గా చేస్తోందని ఆయ‌న‌ ఆరోపించారు. హీరో అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నద‌ని అన్నారు. 

భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ఉన్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి హీరో‌ను మాత్ర‌మే ప్ర‌భుత్వం కార‌ణంగా చూపుతోంద‌న్నారు. ఒక త‌ప్పును క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నంలో ప్ర‌భుత్వం అనేక త‌ప్పులు చేస్తోంద‌ని ఎంపీ ఆరోపించారు. బ‌న్నీ ప్రెస్ మీట్ పెట్ట‌డానికి వీలు లేన‌ప్పుడు, సీపీ వీడియోలు ఎలా విడుద‌ల చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

ప్ర‌భుత్వం క‌క్షగ‌ట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌న్నారు. ఈ కేసుకి సంబంధించి ప్ర‌భుత్వం కావాల‌ని సెన్సేష‌న్ చేస్తోందన్నారు. న్యాయ‌స్థానం ఇప్పటికే 30 రోజుల బెయిల్ ఇచ్చినందున పోలీసులు ఏ వ్యక్తిపైనా ప్రతీకారం తీర్చుకోకూడదంటూ ర‌ఘునంద‌న్ రావు చెప్పుకొచ్చారు.
MP Raghunandan Rao
BJP
Allu Arjun
Telangana

More Telugu News