Jagan: తన తండ్రి వైఎస్ కు నివాళి అర్పించిన జగన్

Jagan in Idupulapaya

  • బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్
  • ఎస్టేట్ లో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
  • మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయల్దేరనున్న వైసీపీ అధినేత

తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి ఇడుపులపాయకు జగన్ వచ్చారు. తండ్రికి నివాళి అర్పించిన అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్ లో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జగన్ కుటుంబ సభ్యులు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. 

కాసేపట్లో ఆయన కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ఇడుపులపాయ నుంచి పులివెందులకు బయల్దేరుతారు. పులివెందులలోని నివాసంలో బస చేస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి బెంగళూరుకు తిరుగుపయనమవుతారు. 

  • Loading...

More Telugu News