Allu Arjun: అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించిన పోలీసులు!

Police shows stumpede video to Allu Arjun

  • సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్
  • నేడు చిక్కడపల్లి పీఎస్ లో విచారణ
  • అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్న డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ టీమ్

సంధ్య థియేటర్ ఘటనలో ఏ11గా ఉన్న హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు. కాగా, కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలతో సంతృప్తి చెందని పోలీసులు... అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించగా, ఆయన మౌనం వహించినట్టు తెలిసింది. 

ఓ ప్రశ్నకు సమాధానంగా, తాను ఓ సాధారణ ప్రేక్షకుడిలా సంధ్య థియేటర్ కు వెళ్లానని అల్లు అర్జున్ చెప్పినట్టు సమాచారం. ఇక, సంధ్య థియేటర్ కు సెలబ్రిటీల రాకపై తాము అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా పోలీసులు అల్లు అర్జున్ ముందు పెట్టగా... అందుకు కూడా ఆయన మౌనంగా ఉన్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News