Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు
- రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ నివాసంపై జేఏసీ నేతల దాడి
- అవాంఛిత ఘటనలు జరగకుండా పరదాలు ఏర్పాటు చేసిన అధికారులు
- లోపలి వ్యక్తులు బయటకు కనిపించకుండా తెల్లటి గుడ్డలతో ఇంటిని కప్పేసిన అధికారులు
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అధికారులు పరదాలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసం వద్ద హంగామా సృష్టించారు. జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై వారు దాడికి పాల్పడ్డారు. ఈరోజు పోలీసులు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నారు.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు... అవాంఛిత సంఘటనలు జరగకుండా తెల్లటి పరదాలను ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద... బయటి వ్యక్తులకు లోపల కనిపించకుండా తెల్లటి గుడ్డలను ఇంటి చుట్టూ కట్టారు.