Allu Arjun: సంధ్య థియేటర్ కేసులో ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

Allu Arjun a 11 in Sandhya Theatre case

  • ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం
  • ఏ-11గా అల్లు అర్జున్ పేరు
  • ఏ-12 నుంచి ఏ-17 మధ్య అల్లు అర్జున్ సెక్యూరిటీ టీమ్

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, ఏ-9, ఏ-10గా థియేటర్ సెక్యూరిటీ, ఫ్లోర్ ఇంఛార్జ్‌లను నిందితులుగా చేర్చారు. ఏ-12 నుంచి ఏ-17 వరకు అల్లు అర్జున్ బౌన్సర్లను, ఫ్యాన్స్ అసోసియేషన్ నేతను చేర్చారు.

తొక్కిసలాట కేసులో నిందితులు వీరే...

ఏ-1గా అగమాటి పెదరామిరెడ్డి (థియేటర్ ఓనర్), ఏ-2గా అగమాటి చిన్నరామిరెడ్డి (థియేటర్ ఓనర్), ఏ3గా ఎం.సందీప్(పార్ట్‌నర్‌), ఏ-4గా సుమిత్‌ (పార్ట్‌నర్‌), ఏ-5గా అగమాటి వినయ్ (పార్ట్‌నర్), ఏ-6గా అశుతోష్ రెడ్డి (పార్ట్‌నర్‌), ఏ-7గా రేణుకాదేవి (పార్ట్‌నర్), ఏ-8గా అరుణారెడ్డి (పార్ట్‌నర్), ఏ-9గా నాగరాజు (మేనేజర్), ఏ-10గా విజయ్‌చందర్ (లోయర్ బాల్కానీ ఇన్‌చార్జ్‌) ఉన్నారు.

ఏ-11గా అల్లు అర్జున్, ఏ-12గా సంతోష్ (అల్లు అర్జున్ పీఏ), ఏ-13గా శరత్ బన్నీ (అల్లు అర్జున్ మేనేజర్), ఏ-14గా రమేశ్ (సెక్యూరిటీ టీమ్), ఏ-15గా రాజు (సెక్యూరిటీ టీమ్), ఏ-16గా వినయ్ కుమార్(ఫ్యాన్స్ అసోసియేషన్), ఏ-17గా ఫర్వేజ్‌(బాడీగార్జ్), ఏ-18గా మైత్రీ మూవీస్ నిర్మాతలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News