cm revanth reddy: క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

cm revanth reddy extended christmas greetings to christian brothers and sisters

  • ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకాలన్న సీఎం  
  • శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్న రేవంత్
  • రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని పిలుపు   

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మనవత్వమేనని అన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని, శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. 

ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖావృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్‌ను జరుపుకోవాలన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని సూచించారు. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.   

  • Loading...

More Telugu News