WhatsApp Scanning: వాట్సాప్‌ నుంచి అదిరిపోయే మరో ఫీచర్.. ఇక ఈజీగా డాక్యుమెంట్ల స్కానింగ్!

WhatsApp rolls out a new feature to scan documents

  • డాక్యుమెంట్ల స్కానింగ్ కోసం కొత్త ఫీచర్
  • ఇప్పటికే ఐవోస్ లేటెస్ట్ వెర్షన్‌పై అందుబాటులోకి
  • థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే స్కానింగ్
  • త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి

మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేస్తోంది. వాట్సాప్‌లో ఏదైనా డాక్యుమెంట్‌ను షేర్ చేయాలంటే తొలుత దానిని స్కాన్ చేయాలి. ఇందుకు థర్డ్ పార్టీ యాప్ అవసరం. అయితే, ఇకపై ఇలా థర్డ్ పార్టీ యాప్‌లతో పనిలేకుండా నేరుగా వాట్సాప్‌లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రాబోతోంది. ఐవోస్ యూజర్లకు తాజా అప్‌డేట్‌పై ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. 

ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ యూజర్లు తమ మొబైల్ కెమెరా ద్వారానే అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ల క్యాప్చరింగ్, అడ్జెస్ట్‌మెంట్, సెండింగ్ వంటివన్నీ ఇప్పుడు ఒక్క క్లిక్‌తో చేసుకోవచ్చు. యూజర్ తొలుత డాక్యుమెంట్ షేరింగ్ మెనూను ఓపెన్ చేసి ఆ తర్వాత స్కాన్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కెమెరా యాక్టివేట్ అవుతుంది. డాక్యుమెంట్‌ను స్కాన్ చేసిన తర్వాత యూజర్లు ఇన్‌స్టంట్‌గా ప్రివ్యూ చూసుకుని అవసరమైన ఎడ్జెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. యాప్ కూడా ఆటోమెటిక్‌గా మార్జిన్స్ చూపిస్తుంది. యూజర్లు మాన్యువల్‌గానూ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అంతా బాగానే ఉందనుకుంటే ఆ తర్వాత డాక్యుమెంట్లను సెండ్ చేసుకోవడమే. 

ఈ ఫీచర్ వల్ల వాట్సాప్ యూజర్లు డాక్యుమెంట్లు సెండ్ చేసేందుకు ప్రత్యేకంగా యాప్స్, ప్రింటర్ల అవసరం ఉండదు. అంతేకాదు, స్కానింగ్ పూర్తి స్పష్టంగా, చదివేలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఫలితంగా వ్యక్తిగతంగా, వ్యాపార పరంగానూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే రిసీట్లు, కాంట్రాక్ట్స్, నోట్స్ వంటి వాటిని ఇక చిటికెలో షేర్ చేసుకునే వెసులుబాటు ఈ ఫీచర్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.

  • Loading...

More Telugu News