Christmas In Japan: జపాన్​ లో ప్రేమికుల దినోత్సవంలా క్రిస్మస్

Why Christmas In Japan Is Celebrated Like A Second Valentines Day For Couples

  • పండుగలా కాకుండా రొమాంటిక్ డేట్ గా జరుపుకుంటున్న జంటలు
  • దేశ జనాభాలో క్రైస్తవుల సంఖ్య ఒక్క శాతం కంటే తక్కువే
  • ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్న రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. క్రీస్తు పుట్టిన పర్వదినాన్ని జనం భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, జపాన్ యువత మాత్రం క్రిస్మస్ ను ప్రేమికుల దినోత్సవంలా భావిస్తున్నారట. క్రిస్మస్ ను పండుగలా, ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా రొమాంటిక్ డేట్ గా నిర్వహించుకుంటున్నారట. పండుగను ప్రేమికుల దినోత్సవంలా ఫీలవడం ఏంటని అనుకుంటున్నారా.. దీనికి కారణం జపాన్ లో క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ. దేశ జనాభాలో కేవలం ఒక శాతం లోపే క్రీస్తును నమ్ముతారు. అక్కడి జనాభాలో ఎక్కువ శాతం మంది షింటోయిజం ఫాలో అవుతుంటారు. క్రైస్తవులు తక్కువ మందే ఉన్నప్పటికీ ప్రభుత్వం క్రిస్మస్ సెలవు ఇవ్వడంతో యువ జంటలు, దంపతులు పండుగను రొమాంటిక్ గా జరుపుకుంటున్నారు.

చల్లటి వాతావరణం, క్రిస్మస్ లైట్ల వెలుగులు తమకు అలాంటి ఫీలింగ్ కలగజేస్తున్నాయని చెబుతున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, భాగస్వామితో సన్నిహితంగా మెలిగేందుకు ఈ సెలవును ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు. దీనిని అక్కడి రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ అడ్వాంటేజీగా తీసుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడం కూడా కారణమేనని అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రత్యేక ఆఫర్లతో జనాలను ఆకర్షిస్తున్నాయి. దీంతో భాగస్వామితో సరదాగా షాపింగ్ చేస్తూ, రెస్టారెంట్ లో డిన్నర్ కు వెళుతూ యువ జంటలు సెకండ్ హనీమూన్ లాగా ఫీలవుతున్నారట.

  • Loading...

More Telugu News