Kakani Govardhan Reddy: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఐ, ఆర్ఐల అంతు చూస్తాం: కాకాణి గోవర్ధన్

Kakani Govardhan warning to CI

  • ఇటీవల కాకాణి అనుచరుడిపై కేసు నమోదు
  • ఒక మహిళను లైంగికంగా వేధించారని కేసు
  • అధికారులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కాకాణి

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తామంటూ పోలీసు, రెవెన్యూ అధికారులకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సీనియస్ వార్నింగ్ ఇచ్చారు. తన ముఖ్య అనుచరుడిపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. కాకాణి వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వివరల్లోకి వెళితే... కాకాణి అనుచరుడు వెంకటశేషయ్యపై ఇటీవల కేసు నమోదయింది. లైన్ మెన్ అయిన తన భర్త చనిపోతే తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చాలా కాలంగా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెంకటశేషయ్యపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా లైంగిక వేధింపులను కొనసాగించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దీంతో, పోలీసులు వెంకటశేషయ్యపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆమెను రిమాండ్ కు కూడా తరలించారు.   

ఈ నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ సిబ్బందిపై కాకాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవిలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరూ శాశ్వతంగా విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకాణి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News