Mohan Babu: నా సినీ ప్ర‌యాణంలో గొప్ప మైలురాయి.. మోహ‌న్ బాబు భావోద్వేగ‌ ట్వీట్‌!

Mohan Babu Emotional Tweet on Assembly Rowdy Movie

  • కుటుంబ గోడ‌వ‌ల కార‌ణంగా ఇటీవ‌ల వార్త‌ల్లో నిలుస్తున్న మోహ‌న్ బాబు
  • తాజాగా 'అసెంబ్లీ రౌడీ' మూవీని ప్ర‌స్తావిస్తూ ఎమోష‌న‌ల్ ట్వీట్  
  • ఈ సినిమా త‌న త‌న‌ కెరీర్‌లోనే ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింద‌ని వ్యాఖ్య‌

గ‌త కొన్నిరోజులుగా కుటుంబ గోడ‌వ‌ల కార‌ణంగా సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయ‌న తాజాగా ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. 1991లో వ‌చ్చిన త‌న సినిమా 'అసెంబ్లీ రౌడీ'ని ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌ ఈ ట్వీట్ చేశారు. 

"1991లో విడుద‌లైన అసెంబ్లీ రౌడీ నా సినీ ప్ర‌యాణంలో ఒక గొప్ప మైలురాయి. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన‌ ఈ యాక్ష‌న్‌, కామెడీ డ్రామాలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర పోషించాను. ఆక‌ట్టుకునే క‌థాంశం ఈ చిత్రం సొంతం. పి.వాసు, పరుచూరి బ్రదర్స్‌ అందించిన ఇంపాక్ట్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.  థియేట‌ర్ల‌లో 200 రోజులు ఆడి, రికార్డుల మోత మోగించింది. 

నాకు క‌లెక్ష‌న్ కింగ్ అనే టైటిల్‌ను అందించిన సినిమా కూడా ఇదే. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆయ‌న అందించిన‌ టైమ్‌లెస్ మ్యూజికల్ హిట్‌లు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి" అంటూ త‌న ట్వీట్‌లో మోహ‌న్ బాబు రాసుకొచ్చారు. దీనికి మూవీలో ఓ అద్బుత‌మైన‌ స‌న్నివేశం తాలూకు వీడియోను కూడా జ‌త చేశారు.  

  • Loading...

More Telugu News